పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో గల కాంబల్లె గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, శుక్రవారం రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా జరుగుతున్న స్మశానవాటిక, సీసీ రోడ్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. అనంతరం సంబంధిత అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.