డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు
మరుపురాని మహానేత, రైతు బాంధవుడు ఏపీ మాజీ సీఎం కి. శే. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా పుల్లంపేట మండల అధ్యక్షుడు ముద్దా బాబుల్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డి, పుల్లంపేట మండల కన్వీనర్ సయ్యద్ ముస్తాక్, జడ్పిటిసి రామనాథం ఆధ్వర్యంలో సోమవారం వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన౦గా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.