కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మరణాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో మాస్కులను తప్పనిసరి చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పెరింతల్‌మన్నలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నిఫావైరస్‌తో 23 ఏళ్ల వ్యక్తి గత సోమవారం చనిపోయాడు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను మూసివేశారు.