తల్లి చనిపోయిన చిన్నారులకు రూ.50వేలు ఆర్థిక సహాయం
పుల్లంపేట మండలం టి. కమ్మపల్లి అరుంధతి వాడకు చెందిన ఇందుకూరు మణెమ్మ ఇటీవల ప్రసవ సమయంలో మరణించారు. దీంతో ఆమె కూతుళ్లు భవిష్య, వర్షలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చొప్పున 50 వేల రూపాయలు ముక్కా రూపానందరెడ్డి తన ట్రస్ట్ ద్వారా గురువారం చెక్కుల రూపంలో అందించారు. 23 వ తేదీన పుల్లంపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారి తండ్రికి ఇచ్చిన హామీని 48 గంటలలోపు రూపానందరెడ్డి నెరవేర్చారు.