రైల్వే కోడూరు నియోజకవర్గంలోని బొప్పాయి రైతులను దళారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి దోచుకుంటున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆరోపించారు. మంగళవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాదని, ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. దళారులు రైతులకు విత్తనాలు, మొక్కలు ఇవ్వడంతో వారికే కాయలు అమ్మవలసి వస్తోందన్నారు.