కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ మోసమని, గత ప్రభుత్వం కన్నా అధికంగా ధరలు ఉన్నాయని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, మండల కార్యదర్శి జాన్ ప్రసాద్ ఆరోపించారు. గురువారం రైల్వే కోడూరు సిఐటియు కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవన్నారు. ట్రాక్టరు ఇసుక గతంలో 3000 రూపాయలు కాగా నేడు రూ.10000 పెట్టినా ఇసుక దొరకడం లేదన్నారు.