బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు

75చూసినవారు
బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు
రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట ఎస్టీ మినీ గురుకులం బాలికలు పాఠశాలను శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు ఓడిత్య సోమశంకర్ నాయక్ పరిశీలించారు. బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రత్నమ్మ, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఎంపిటిసి మల్లికార్జున, ఇంచార్జ్ తహసిల్దారు రెడ్డి ప్రసాద్, విద్యాశాఖాధికారి రామయ్య, జిల్లా యానాది సంఘం అధ్యక్షులు జలకం శివయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్