ఓబులవారి పల్లి మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మౌలిక వసతులు కల్పించి సేవ చేయాలని ఓబులవారి పల్లి మండల అభివృద్ధి అధికారి మల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం సభా భవనంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలలో త్రాగునీరు, వీధిలైట్లు, ప్రజల ఆరోగ్యం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.