పేద గిరిజనులకు ప్రభుత్వ బంజరు భూములు కుటుంబానికి 3 ఎకరాలు ఇవ్వాలని బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి డిమాండ్ చేశారు. సోమవారం పుల్లంపేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగంపల్లి పంచాయతీ రాచపల్లి ఎస్టీ కాలనీలో నివసించే 30 నిరుపేద కుటుంబాల వారికి సర్వే నెంబర్ 585 లో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని పంచివ్వాలని వారు డిమాండ్ చేశారు.