సంక్షోభంలో వున్నా సంక్షేమ పథకాలను అందించడం చంద్రబాబు నిబద్దతకు నిదర్శనం అని రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్, నియోజకవర్గ బాధ్యులు రూపానంద రెడ్డి అన్నారు. అనంతరాజుపేటలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఒకేరోజు 65. 18లక్షల మందికి పింఛన్ పంపిణి, ఒకటో తారీకునే ఉద్యోగులకు జీతాలు, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ల ద్వారా భోజనం అందించడం జరుగుతోందన్నారు.