సిద్దవటంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి పెన్నాను కొల్లగొడుతున్నారు. బుధవారం సిద్దవటంలోని గాండ్లపాలెం పెన్నాలో అక్రమ తవ్వకాలను అరికడుతూ మండల ఎస్సై చిరంజీవి జేసీబీ యంత్రంతో గుంతలు తీయించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు.