వసతి గృహాల సమస్యలు పరిష్కరించండి

83చూసినవారు
వసతి గృహాల సమస్యలు పరిష్కరించండి
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర బుధవారం కోరారు. రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి సమస్యలు తీర్చాలని వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్