Dec 13, 2024, 00:12 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
చికెన్ పల్లిలో భూలక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
Dec 13, 2024, 00:12 IST
భూపాలపల్లి గ్రామీణ మండలం చికెన్ పల్లి గ్రామంలో అత్యంత వైభవంగా భూలక్ష్మీ(బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. భూలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో సుఖంగా ఉండాలని కోరుకున్నారు. చికెన్ పల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కు తన వంతుగా సహకారం ఉంటుందని పేర్కొన్నారు.