TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. తాము గతంలోనే అనుకూలంగా తీర్మాణం చేశామన్నారు. అప్పట్లోనే పార్లమెంట్ దీన్ని ఆమోదించి ఉంటే ఇప్పటికే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కేవన్నారు. వర్గీకరణ అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌కు సూచించారు.