రాయచోటిలో ప్రజల వైద్య సౌకర్యాల నిమిత్తం 100 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రి గా అభివృద్ధి చేయాలని, డయాలసిస్ వ్యవస్థను 14 నుండి 20 యూనిట్లకు పెంచాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సాంకేతికపరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.