ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలో మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించగా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు.