ఉప్పలగుప్తం - Uppalaguptham

దువ్వూరులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

దువ్వూరులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం దువ్వూరు మండలంలోని పుల్లారెడ్డిపేట హైస్కూల్ లో ప్రదనోపాధ్యాయురాలు అహల్య బాయ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ పి. ఓబన్న, సభ్యులు టి. నాగరాజు పాల్గొని బాలికల హక్కులు, విద్యాఅవకాశాలు గురించి తెలిపారు. అనంతరం విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత గానో అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పిడి శివారెడ్డి, పోతులురయ్య, ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా
Oct 25, 2024, 08:10 IST/జనగాం
జనగాం

జనగామ: బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం

Oct 25, 2024, 08:10 IST
జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్-బిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన లక్ష 116 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని వేదికపై కోరిన 2వ వార్డు కౌన్సిలర్ అనిత, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింప జేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది.