కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో 80 మందికి పైగా ఆదివారం
బీజేపీ పార్టీలో చేరారు. వారిని మండల అధ్యక్షులు యడాలి రాంబాబు, నియోజకవర్గం కన్వీనర్ దాట్ల కృష్ణ వర్మ
బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి
బీజేపీ పాలనతోనే సాధ్యం అని తెలుసుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి, పల్లా రాము, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.