ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: ఎంపీ

83చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఎంపీ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటిముందు ఒక్కొక్క మొక్క నాటాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్