దుర్గం: బాల్య వివాహాల నిరోధంకు సంబంధించిన పోస్టర్లు విడుదల
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్. డి. టి ఎకాలజీ సెంటర్ లో సోమవారం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కింద బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాలు జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.