కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గుబనపల్లికి చెందిన ఓ యువతికి, కర్ణాటకకు చెందిన సాయి తేజ అనే యువకుడు మాయమాటలు చెప్పి 8 నెలల గర్భవతిని చేసి, మోసం చేసాడని దళిత సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బాధితురాలు కళ్యాణ దుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అయితే పోలీసులు బాధితురాలికి అన్యాయం చేస్తున్నారని దళిత సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు.