సత్తెమ్మ తల్లికి విశేష పూజలు

82చూసినవారు
సామర్లకోట సత్యనారాయణ పురంలో పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన వెంచేసియున్న సత్తెమ్మ అమ్మవారికి ఆదివారం. విశేష పూజలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి, నీలిమ హోటల్ యజమాని అమలకంటి శ్రీనివాసరావు స్వయంగా ఆశీనులయ్యి అమ్మవారికి నవ వర్ణార్చన, పుష్పార్చన పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. పెద్దఎత్తున ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్