కోటనందూరు మండలం కే. ఏ మల్లవరం గ్రామంలో సోమవారం వైసీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేముల సత్యవేణి, రాజుబాబు దంపతుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నమూనా ఈవీఎంతో ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.