ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు

64చూసినవారు
ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్