పవన్ కు కీలక శాఖలు ఖరారు..!

588చూసినవారు
పవన్ కు కీలక శాఖలు ఖరారు..!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేసారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. అయితే పవన్ కు ఇష్టమైన గ్రామీణ, పర్యావరణ శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్