ఏపీలో రాబోయే ఎన్నికలపై సీఎస్ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నఅధికారులను
తప్పనిసరి బదిలీ చేయడంతో పాటు కొత్తవారికి పో
స్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల వేళ డబ్బు, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టుల ఏర్పాటుపై చర్చించారు.