అంతరించిపోయే దశలో కింగ్ కోబ్రాలు

1072చూసినవారు
అంతరించిపోయే దశలో కింగ్ కోబ్రాలు
ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్ద విషపూరిత ప్రాణుల్లో కింగ్ కోబ్రా ఒకటి. దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడవు ఉండే ఈ గిరినాగులను చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది. చాలా అరుదుగానే ఇవి మనుషులను కాటేస్తాయి. ఏపీలోని మన్యంలో తరుచూ కనిపించే ఈ గిరినాగులు అంతరించేపోయే జంతుజాతుల జాబితాలో చేరాయి. అందుకే ఈ నాగజాతిని రక్షించుకునేందుకు తూర్పు కనుమల వైల్డ్‌లైఫ్‌ సొసైటీ నడుం బిగించింది. వాటి గుడ్లను పరిరక్షిస్తోంది.

సంబంధిత పోస్ట్