అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలెంలో కోడిపందేల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బరులను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్ పెట్టి బరుల కోసం సిద్ధం చేసిన ప్రాంతాన్ని దగ్గరుండి దున్నించేశారు. కోడిపందేలు, గుండాటలు వంటి అసాంఘిక కార్య కలాపాలపై నిషేధం విధించామని పోలీసులు హెచ్చరించారు. వాటిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.