అమలాపురం పట్టణంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబును కోరారు. ఆయన అమరావతిలో కృష్ణ బాబును శుక్రవారం కలిసి అమలాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు వివరాలను తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమలాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే అన్నారు.