అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రభుత్వం ఇటీవల రైతు బజార్ ఏర్పాటు చేసింది. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. కోనసీమలో రైతులు తమ పొలాల్లో పండించిన కూరగాయలను తీసుకు వచ్చి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలకే రైతులు ఇక్కడ అమ్ముతున్నారు. ప్రజలంతా ఇక్కడే కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని ఎస్టేట్ ఆఫీసర్ గురువారం కోరారు.