బిక్కవోలు మండలం పందలపాక పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిర్ల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోణాల సత్తిరాజు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. 11 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.