పి. గన్నవరంలోని బోడపాటి వారి పాలెం నుంచి గుత్తుల వారి పాలెం వెళ్లే రహదారి అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించే పనులను అధికారులు మంగళవారం చేపట్టారు. ఏళ్ల తరబడి ఈ రహదారి అభివృద్ధి పనులు నిర్వహించకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పాలకులు, అధికారులు స్పందించి అభివృద్ధి పనులు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.