ద్వారకాతిరుమల: నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

57చూసినవారు
ద్వారకాతిరుమల: నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటినుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులు కన్నుల పండుగగా అలంకరించారు. ఈనెల 20 వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీ రాత్రి స్వామివారి తీరు కళ్యాణం, 18వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్