ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్లూరు జీయన్న స్వామి ఆలయంలో శుక్రవారం జగ్గంపేట జనసేన ఇన్ ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏకాదశి సందర్భంగా స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు.