మాజీ ఐఏఎస్ ఎస్. ఆర్. శంకరన్ 90వ జయంతిని కాకినాడ కలెక్టరేట్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ లో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో శంకరన్ జయంతి సభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోసన్ ముఖ్యఅతిథిగా. ట్రైనీ కలెక్టర్ భావన, సిపిఎం నాయకులు మధు, రెడ్ క్రాస్ చైర్మన్ వై డి రామారావు, ఆర్డీవో మల్లిబాబు, డిఆర్ఓ తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.