కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా జే వెంకట్రావు నియమితులయ్యారు. శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్రావు గతంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు డిఆర్ఓగా వ్యవహరించిన పని చేసిన డాక్టర్ డి తిప్పే నాయక్‌ను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెండు రోజుల్లో కాకినాడ జిల్లా డిఆర్ఓ గా ఆయన భాధ్యతలను చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు.