సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయ పురంలోనిర్వహించిన సర్ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోపీ పోటీలు రెండవ రోజు ఆదివారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో డ్రాగన్ పడవ పోటీలు కేరళను తలదన్నే రీతిలో సాగింది. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆత్రేయపురం - అమలాపురం ప్రధాన కెనాల్ పోటెత్తినట్లయింది.