వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజా మన్ననలు పొందిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో గ్రామంలో శుక్రవారం జరిగిన ఇదిమంచి ప్రభుత్వం గ్రామసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూటమి ప్రభుత్వం ప్రజా పాలన సాగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.