పవిత్రమైన తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నూనె వాడకంపై కేంద్రం దర్యాప్తు సంస్థ చే విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందండిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం భక్తులకిచ్చే లడ్డూప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేయించి అపచారం చేసారని ఆరోపించారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు.