గజ్జరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

59చూసినవారు
గజ్జరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి.. కొవ్వూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారు అన్నారు. పది లక్షల కోట్లు అప్పులో కేవలం మూడు లక్షల కోట్లకు కూడా లెక్కలు చూపించలేకపోయారు అన్నారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని గెలిపించి సమాధానం చెప్పారన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ చెక్కులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్