మండపేట: డ్రైనేజీలో చెత్త వేస్తే చర్యలు

74చూసినవారు
మండపేట: డ్రైనేజీలో చెత్త వేస్తే చర్యలు
మండపేట పట్టణ పరిధిలో డ్రైన్ ల్లో చెత్త చెదరాలు వేస్తే చర్యలు తప్పవని మండపేట పురపాలక సంఘం కమిషనర్ టివి రంగారావు హెచ్చరించారు. వార్డులలో శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా గాంధీనగర్, చిన్న మసీదు, బీరువాల వీధిలో సోమవారం ఆయన పర్యటించారు. గాంధీనగర్ చిన్న మసీదు దగ్గరలో గల కిరణా షాపు ఇంటి ముందర డ్రైనేజీలో చెత్తను వేయడం గమనించి ఆ కిరణా షాపు యజమానికి రూ. 300, మరొకరికి రూ. 700 లు జరిమానా విధించారు.