ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు (వీడియో)

54చూసినవారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మధురై జిల్లా పరమకుడి నుండి మధురై వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. విరగనూర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్