

మురమళ్ల: ఎట్టకేలకు రాఘవేంద్ర వారధిపై గోతులు పూడ్చివేత
216 జాతీయ రహదారి మురమళ్ల రాఘవేంద్ర వారధిపై గోతులు పూడ్చే పనులు చేపట్టారు. నేషనల్ హైవే మెయింటైనెన్స్ సేఫ్టీ ఆఫీసర్ హరి ఆధ్వర్యంలో సిబ్బంది గోతులు పూడుస్తున్నారు. గోతులు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు స్పందించి సోమవారం పనులు చేపట్టారు. రోడ్డు మరమ్మతులతో పాటు రాత్రి వేళల్లో సైతం ఇబ్బంది లేకుండా లైట్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.