కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి యానం చేరుకున్నారు. యానంలో ప్రజా ఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శన కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేదిక వద్దకు సీఎం జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యానం మాజీమంత్రి, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.