అన్నింటిలో కెల్లా ఉత్తమమైన కార్తీక మాసం ప్రారంభమైంది. ఈనెలంతా నదీ స్నానాలు, దీపారాధనలు, ఉపవాసాలు, వ్రతాలు చేయడం చాలా మంచిదని, శుభ ఫలితాలు వస్తాయని అర్చకులు చెబుతుంటారు. దీనికి తోడు ఇవాళ తొలి కార్తీక సోమవారం కావడంతో కోనసీమలోని శివాలయాలకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. ఐ. పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈవో లక్ష్మీనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.