ముమ్మిడివరం: వర్షపు నీటీలోనే రాకపోకలు

64చూసినవారు
ముమ్మిడివరం మండలంలో పెడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కాశివారితూము సమీపంలో గల నివాస గృహాల చుట్టూ వర్షపు నీరు చేరింది. నేరు దిగే వీలు లేకపోవడంతో చెరువును తలపిస్తుంది. నీటిలోనే రాకపోకల కొనసాగిస్తున్నామని, పాములు, దోమలు బెడద ఎక్కువగా ఉందని వృద్దులు సోమవారం ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు స్పందించి నీరు దిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్