ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా శుక్రవారం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయూస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్ష జరిగింది. గతంలో చేసిన 17 రోజుల సమ్మె ముగిసి ఏడాది గడుస్తున్నది. నేటికీ అమల కానందున సమ్మె కాలపు ఒప్పందాలు జీవోల కోసం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగినది. ఈ మేరకు దీక్ష నిర్వహించారు.