దేవరలో కొన్ని సీన్లు తొలగించారా?
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ప్రీమియర్ షోల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో దేవర క్రేజ్ ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. హిందీలోనూ ఇంతే క్రేజ్ కొనసాగుతోంది. అయితే దేవర మూవీ రన్ టైం 2.50 గంటలు. హిందీ ప్రేక్షకుల కోసం 7 నిమిషాలు తొలగించినట్లు సమాచారం. తెలుగులోనూ నటీనటులకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.