నిడదవోలు: పతనమైన టమోట ధర

68చూసినవారు
నిడదవోలు: పతనమైన టమోట ధర
టమోట ధర నేల చూపులు చూస్తోంది. సోమవారం మార్కెట్లో కనిష్ఠంగా కిలో రూ. 13 పలికింది. గ్రేడ్ ను బట్టి 10 కేజీల బాక్స్ ధర రూ. 130 నుంచి 160 వరకు ఉంది. చిత్తూరుతో పాటు స్థానికంగా పంట అందుబాటులోకి రావడంతో డిమాండ్ తగ్గి ధర పడిపోయిందని ఉమ్మడి ప. గో జిల్లా హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. 25 కిలోల ట్రే రూ. 300లు ధర పలికిందని చెప్పారు. ధర తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

సంబంధిత పోస్ట్