ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్) మొదటి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. రాజారావు కోరారు. సోమవారం పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర కన్వీనర్ బుగత శివ, రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లా రాజు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం ఆలీ, లేడీ రిప్రజెంటేటివ్ ఎం. సత్యవతి తదితరులు పాల్గొన్నారు.